Header Banner

నాలుగైదు రోజుల్లో కేరళకు నైరుతి రుతుపవనాలు! జులై 8వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా..

  Tue May 20, 2025 15:21        Environment

దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) చల్లని కబురు అందించింది. మరో నాలుగైదు రోజుల్లోనే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వార్తతో ఉపశమనం లభించనుంది. భారత వాతావరణ విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం, నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం శ్రీలంక, అండమాన్ నికోబార్ దీవుల ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. ఇవి చురుగ్గా కదులుతూ, రాబోయే నాలుగు లేదా ఐదు రోజుల్లో కేరళ రాష్ట్రంలో ప్రవేశించేందుకు అన్ని అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఐఎండీ అధికారులు తెలిపారు. సాధారణంగా జూన్ మొదటి వారంలో కేరళను తాకే రుతుపవనాలు, ఈ ఏడాది మే నెలాఖరులోనే పలకరించనున్నాయి. రుతుపవనాల కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నామని, ఇవి జులై 8వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా విస్తరిస్తాయని అంచనా వేస్తున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ ఏడాది రుతుపవనాల ఆగమనం ముందుగానే ఉండటంతో, వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్న రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తొలకరి వర్షాలు సరైన సమయంలో కురిస్తే పంటలకు మేలు జరుగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవులపై జోరుగా చర్చలు.. మరో జాబితా లిస్ట్ రెడీ! చంద్రబాబు కీలక సూచన - వారిపై ఎక్కువ దృష్టి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నారా రోహిత్​పై కిడ్నాప్​ ఆరోపణలు! సీఎంకు కంప్లైంట్​ చేస్తానన్న మంచు మనోజ్!

 

శ్రీశైలం ఆలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్పై వేటు! ఘటన వెలుగులోకి రావడంతో..

 

బాంబు పేలుళ్ల కుట్ర భగ్నం..! వెలుగులోకి సంచలన విషయాలు!

 

ఏపీలో త్వరలోనే నంది అవార్డులు! సినిమాలతో పాటు నాటక రంగానికి..!

 

అమెరికా ప్రయాణికుల‌కు కీలక హెచ్చరిక! గడువు దాటితే తీవ్ర పరిణామాలు! శాశ్వత నిషేధం కూడా..

 

హర్భజన్ పై మండిపడుతున్న కోహ్లీ ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో దుమారం!

 

గుల్జార్‌హౌస్‌ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై స్పందించిన మోదీ, ఏపీ సీఎం! మృతుల కుటుంబాల‌కు ప‌రిహారం ప్ర‌క‌ట‌న‌!

 

ఏపీలో సీనియర్ సిటిజన్లకు బంపరాఫర్.. సర్కార్ కీలక నిర్ణయం! వాట్సాప్ ద్వారానే - అస్సలు మిస్ కాకండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Rain #AndhraPradesh #APSDMA #Weather #CycloneDana